కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం మిల్లు 2018లో పునః ప్రారంభమైనప్పటి నుంచి కార్మిక సంఘం
ఎన్నికలు నిర్వహించలేదని సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం, లేబర్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకొని సిర్పూర్ పేపర్ మిల్లులో వెంటనే
ఎన్నికలు నిర్వహించాలని కోరారు.