సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ఆమరణ నిరహార దీక్ష ప్రారంభించారు. సోమవారం సిర్పూర్ టౌన్ మండల కేంద్రంలోని రేంజ్ ఆఫీస్ ఎదురుగా ఎమ్మెల్యే ఆమరణ నిరహార దీక్షను ప్రారంభించారు. అటవిశాఖ అధికారుల దౌర్జన్యాలను నిరసిస్తూ, అలాగే బెంగాలీ రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈదీక్ష చేపట్టినట్టు ఎమ్మెల్యే తెలిపారు. బీజేపి నాయకులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.