కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు ఇటీవల ప్రాణహిత నదిలో గల్లంతై మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరి వెంట బీఆర్ఎస్ నియోజకవర్గ కన్వీనర్ శ్యామ్ రావు, సలీం, శ్రీనివాస్ యాదవ్, రాంప్రసాద్, సారయ్య యాదవ్, బాపూరావు, తదితరులు ఉన్నారు.