దహేగాం పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్తిని గ్రామంలో బుధవారం రాత్రి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో నూతన చట్టాలు, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, సైబర్ మోసాలు, గంజాయి నివారణపై అవగాహన, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఎస్ఐ రాజు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్టైతే 1930 నంబర్ కి పిర్యాదు చేయాలని సూచించారు.