సిర్పూర్ టి మండలం వెంకట్రావు పేట్ రోడ్లపై గణేష్ చందా పేరుతో రాత్రిపూట ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, అక్రమ వసూళ్లకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సిర్పూర్ టీ ఎస్ఐ కమలాకర్ తెలిపారు. ఎవరైనా గణేష్ చందా పేరుతో అక్రమంగా వసూళ్లకు పాల్పడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.