కాగజ్‌నగర్ పట్టణంలోని గౌడ సంఘం ఆవరణలో శుక్రవారం బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విల్లు, సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు హాజరై కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లుగీత కార్మికులు కిట్లను ధరించి తాటి చెట్టు ఎక్కాలని సూచించారు. గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.