జిల్లా పోలీసు శాఖ ఈనెల 24 నుంచి జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. కౌటాల పోలీస్ స్టేషన్ వేదికగా నిర్వహిస్తున్నామని ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 22 శనివారం వరకు 8466943511 కు కాల్ చేసి టీం పేరును నమోదు చేసుకోవాలని చెప్పారు. ఒక గ్రామం నుంచి ఒక్క టీంకి మాత్రమే అవకాశం ఉందన్నారు.