బెల్టు షాపులు ఎత్తివేయాలని మహిళల నిరసన

56பார்த்தது
బెల్టు షాపులు ఎత్తివేయాలని మహిళల నిరసన
బెల్ట్ షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వాంకిడి మండలం గోయగాం గ్రామానికి చెందిన మహిళలు బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోయగాం గ్రామంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటుచేసి మద్యం విక్రయిస్తున్నారన్నారు. అనంతరం జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி