రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం వాంకిడి మండల అంబేద్కర్
యువజన సంఘం వాంకిడి సహకారంతో సిద్ధార్థ యువజన సంఘం వాంకిడి ఆధ్వర్యంలో మహా రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ సంఘం నాయకులు తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా ఎస్పి చిత్తరందన్ దాస్ హాజరై ప్రారంభిస్తారని వారు తెలిపారు.