కొమురంభీం జిల్లాలోని 15 మండలాలలో కేజీబీవీ హాస్టల్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 10న కేజీబీవీలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న వారు గురుకుల పరీక్ష రాసి గురుకులాలలో నియమితులయ్యారు. బుధవారం ఉపాధ్యాయుల నియమాకాలు చేపట్టాలని కోరుతూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కు వినతిపత్రం ఇచ్చారు. త్వరలో ఉపాద్యాయులను నియమిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్తీక్, టెకానంద్ తదితరులున్నారు.