పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయ సిబ్బంది కృషి చేయాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ లోని రాజేంద్ర ప్రసాద్ బీఎడ్ కళాశాలలో డీఈవో యాదగిరితో కలిసి జిల్లాలో హెచ్ఎంలకు పదవ తరగతి వార్షిక పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఏకాగ్రతతో ఉండేలా అవగాహన కల్పించాలన్నారు.