కొణిజర్ల: కులగణన సర్వేను పరిశీలించిన జిల్లా ప్రత్యేకాధికారి
కొణిజర్ల మండలం అన్నవరం గ్రామంలో చేపట్టిన కుల గణన సర్వేను శనివారం జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ పరిశీలించారు. సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సర్వేలో అధికారులకు ఇంటి యజమానులు వివరాలు చెప్పి సహకరించాలని కోరారు. విధుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.