ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు తేలినా మిల్లర్లపై చర్యల్లో ఎందుకు జాప్యం చేస్తున్నారని శుక్రవారం సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ప్రశ్నించారు. సీఎంఆర్ విషయమై అక్రమాలు జరగగా, అధికారుల పాత్ర ఉందని తెలిపారు. కొణిజర్లలోని ఓ మిల్లు యాజమాన్యాన్ని రూ. 81 కోట్లు చెల్లించాలని ఆదేశించి వదిలేయడం సరికాదన్నారు. ఇకనైనా ఆస్తులు జప్తు చేసి బాధ్యులపై అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.