కారేపల్లికి చెందిన మాజీ వార్డు సభ్యుడు షేక్. గౌసుద్దీన్ కారేపల్లిలో అయ్యప్ప స్వామి మండల దీక్ష చేపట్టిన మాలదారులకు శుక్రవారం రూ. 10, 800 విలువైన రెండు క్వింటాల బియ్యాన్ని వితరణగా అందించి, తన మానవత్వాన్ని చాటుకున్నారు. ముస్లిం అయినప్పటికీ సేవకు కులాలతో సంబంధం లేదని, అన్ని కులాలకు కలిపి తన వంతు సహాయం అందిస్తూ ముందుకు సాగుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు పాలిక సారయ్య, తదితరులు పాల్గొన్నారు.