వైరా: అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయండి
లగచర్ల రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న గిరిజన సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి భూక్య వీరభద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదంలో ఉన్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లడం నేరమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణి విడనాడాలన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించిన గిరిజన సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు.