ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఎమోషన్ అయ్యి మాట్లాడారు. గత వైసీపీ పాలనలో తన కుటుంబంపై అవమానాలు, ఆరోపణలు ఎదుర్కొందని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నానని, అధికారం తనకు కొత్త కాదని, పదవులు కొత్తవి కాదని అన్నారు. ఏపీలో సుధీర్ఘ రాజకీయ ప్రస్థానం తనకు ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు అవుతుందన్నారు. 150 రోజుల్లో తమ ప్రభుత్వం చేసిన పనులను చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.