ఫుట్బాల్ లెజెండరీ ప్లేయర్ లియోనిల్ మెస్సితో పాటు అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు వచ్చే ఏడాది కేరళలో పర్యటించనున్నారు. అక్కడ ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నారు. కేరళ క్రీడాశాఖ మంత్రి అబ్దురహ్మాన్ ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఆ మ్యాచ్ను నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్జెంటీనా జట్టు కేరళలో రెండు మ్యాచ్లు ఆడనున్నట్లు ఆయన తెలిపారు. కొచ్చి వేదికను ఖరారు చేశారు.