ఉత్తర ప్రదేశ్ లోని ఓ పెళ్లి ఊరేగింపులో వధూవరులపై నోట్ల వర్షం కురిసింది. మగ పెళ్లివారి తరఫున విచ్చేసిన అతిథులు కొందరు కరెన్సీ నోట్లను చిత్తు కాగితాల లాగా విసిరేశారు. జేసీబీల పైకెక్కి, బంగ్లా పై నుంచి రూ.100, 200, 500 నోట్లను గాల్లోకి విసిరారు. ఏకంగా రూ.20 లక్షలను ఇలా వర్షంలా కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.