రైతులు పండించిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. గురువారం కొణిజర్లలో ఆ పార్టీ మండల కమిటీ సమావేశం చింతపల్లి ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించగా ఆయన మాట్లాడారు. తరుగు, తేమ నిబంధనలతో రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులు తక్షణమే అకౌంట్ లలో వేసి రైతులను ఆదుకోవాలన్నారు.