తల్లాడ: ఓటర్ నమోదును పరిశీలించిన ఆర్డిఓ
నేటి నుంచి ప్రారంభమైన ఓటర్ నమోదు కార్యక్రమాన్ని కల్లూరు ఆర్డిఓ రాజేందర్ పరిశీలించారు. తల్లాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బీఎల్వోలు తీసుకుంటున్న దరఖాస్తులను పరిశీలించి పలు సూచనలు చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు, అందుబాటులో ఉన్న ఓటర్ నమోదు కేంద్రానికి వెళ్లి తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని ఆర్డిఓ కోరారు. ఈ కార్యక్రమంలో తల్లాడ తహసిల్దార్, బిఎల్వోలు ఉన్నారు.