ఆర్టీసీ సత్తుపల్లి డిపో నందు శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఉద్యోగులు ఆరోగ్యపరంగా సరిగ్గా ఉంటేనే సంస్థ ఆర్థికంగా పురోగతి సాధిస్తుందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య రక్షణతోపాటు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుందన్నారు.