పెనుబల్లి మండలంలోని నీలాద్రి గ్రామంలోని శ్రీ నీలాద్రీశ్వరస్వామి ఆలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో మంత్రిని సత్కరించారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ తదితరులు ఉన్నారు. అనంతరం సత్తుపల్లిలో మంత్రి పర్యటించారు.