పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టులో ఎమ్మెల్యే మట్టా రాగమయి సోమవారం చేపపిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం వంద శాతం రాయితీపై చేపపిల్లలు అందిస్తోందని తెలిపారు. మత్స్యకారులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఆర్ధికంగా ఎదగాలని సూచించారు. కల్లూరు మార్కెట్ చైర్మన్ నీరజా ప్రభాకర్ చౌదరి, వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, తహశీల్దార్ ఉన్నారు.