రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ విజయం సాధించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ అన్నారు. బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గంలోని ఐదు మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఎటువంటి గ్రూపులు లేకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు దయానంద్ సూచించారు.