పలు దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వేంసూరు మండలం కందుకూరు శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో దొంగతనానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సత్తుపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రఘు కేసు వివరాలను తెలిపారు. పెనుగంచిప్రోలుకి చెందిన ఎల్లబోయిన గోపి, అద్దంకి గురవయ్య, శివ, ముంగి రాము, కృష్ణతో పాటు బాల నేరస్తుడు కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారన్నారు.