తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘ఐఏఎస్లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతాం. షర్మిల అడిగితే భద్రత కల్పిస్తాం. మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. అధికారుల మీద చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోం. వైసీపీ హయాంలో ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారు’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.