ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకోవాలని కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సూచించారు. మంగళవారం పెనుబల్లి మండలంలోని మండాలపాడు, లంకపల్లి, ఏరుగట్ల గ్రామాల్లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నీరజా ప్రభాకర్ చౌదరి, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, తహసీల్దార్ గంటా ప్రతాప్, మాధవరెడ్డి, బొర్రా కోటేశ్వరరావు, మాధవరావు, దామోదర్ ఉన్నారు.