సత్తుపల్లి మండలం బేతుపల్లి, గంగారం గ్రామాల్లో శనివారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీలం పాపారావు ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో 30 లక్షల మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారని, రేపటితో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగుస్తుందని, ఎవరైనా పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే 8800002024కి మిస్ కాల్ ఇచ్చి నమోదు చేసుకోవాలని కోరారు.