సత్తుపల్లి మండలం కిష్టారంలో ఐకేపీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నరకం ధాన్యం క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తున్న నేపధ్యాన రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ వై. శ్రీనివాసరావుతో పాటు మట్టా దయానంద్, సుబ్బారావు, చల్లగుళ్ల నర్సింహారావు, వినుకొండ కృష్ణ పాల్గొన్నారు.