కల్లూరు మండలంలో ముమ్మరంగా సర్వే
కల్లూరు మండలంలో సమగ్ర ఇంటింటి సర్వే ముమ్మరంగా సాగుతోంది. 31 గ్రామాల్లో 135 మంది ఎన్యూమరేటర్లు సర్వే నిర్వహిస్తుండగా 15 మంది సూపర్వైజర్లు, తహశీల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీఓ దాసరి చంద్రశేఖర్, ఎంపీఓ సురేశ్ బాబు, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. సర్వేపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ సిబ్బంది ప్రజలకు నచ్చజెప్పి సమాధానాలు రాబడుతున్నారు.