వేంసూరు: ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
వేంసూరు మండలం భీమవరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్న రకం వరి ధాన్యం (ఐకెపి) కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ఒక్క సన్న రకం ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి క్వింటాకు రూ. 500 బోనస్ అందజేస్తుందని అన్నారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ప్రతిఒక్క హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి మాట నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు.