ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నేలకొండపల్లి ఎంపీడీవో ఎర్రయ్య సూచించారు. స్థానిక మండల పరిధిలోని చెరువుమాదారంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. మండలంలో 22 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు ధరను పొందాలని సూచించారు.