తల్లాడ మండలంలోని కొడవటిమెట్టలో విద్యుత్ మోటార్ చోరీకి గురైన ఘటనపై ఆదివారం తల్లాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ కొండల్ రావు కథనం ప్రకారం.. వైరా మండలం స్టేజీ పినపాకకు చెందిన తన్నీరు నర్సింహారావుకు కొడవటిమెట్టలో పొలం ఉంది. వైరా రిజర్వాయర్ కాల్వకు విద్యుత్ మోటారు పెట్టుకొని నీళ్లు వాడుకుంటున్నాడు. ఈ నెల 8న విద్యుత్ మోటార్ చోరీకి గురైంది. చుట్టుపక్కల రైతులను అడగగా మోటార్ ఆచూకీ దొరకలేదు.