తల్లాడ మండలం పినపాక గ్రామంలో కామ్రేడ్ నల్లమోతు పిచ్చయ్య 37వ వర్ధంతి గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ పాల్గొని పిచ్చయ్య స్థూపానికి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ నల్లమోతు పిచ్చయ్య తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా, బడుగు బలహీనవర్గాలకు అండగా అనేక సమరశీల పోరాటాలు నిర్వహించారని, ప్రతిక్షణం ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే వ్యక్తిగా చరిత్రలో నిలిచారని అన్నారు.