రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురంలో బుధవారం పర్యటించారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రిని అమ్మవారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి పాల్గొన్నారు.