సత్తుపల్లి పట్టణం కిష్టారం గ్రామంలో శనివారం విజయదశమి సందర్భంగా ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి భూమి పూజ చేశారు. సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ లో ఇల్లు కోల్పోయిన ఎస్సీ, బీసీ కాలనీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంజూరైన ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. గత 15 ఏళ్లుగా పరిష్కారం కానీ కిష్టారం గ్రామ సింగరేణి బాధితుల సమస్యలను తాము బాధ్యతగా పరిష్కరించామన్నారు.