సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో టౌన్ బంజారా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయి పాల్గొన్నారు. గిరిజనుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం బంజారా మహిళలతో కలిసి ఎమ్మెల్యే సాంప్రదాయ నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.