కల్లూరు మండలం లక్ష్మీపురంలో హత్యకు గురైన మహిళా కేసు నిందితులను పోలీసులు అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించారు. గ్రామానికి చెందిన భూక్య ప్రసాద్, నెల్లూరు జిల్లాకు చెందిన మల్లేశ్వరి కలిసి పథకం ప్రకారం నరసమ్మ అనే మహిళను హత్య చేసి సమీప చెరువులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల వ్యవధిలోనే మహిళా హత్య కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం ఎస్ఐ షాకీర్ తెలిపారు.