కల్లూరు మండల పరిధిలోని లక్ష్మీపురం పుల్లపుకుంట చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన భూక్యా ప్రసాద్, మల్లేశ్వరి కలిసి మహిళను హత్య చేసి చెరువులో వేసినట్లు విచారణలో తేలిందని కల్లూరు ఏసీపీ రఘు ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐ లింగయ్య, ఎస్ఐ షాకీర్ ఉన్నారు.