ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి. సుబ్బారావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వ్యాక్సినేషన్, ఓపీ రికార్డులను పరిశీలించిన ఆయన మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. సమయపాలన పాటిస్తూ సరిపడా మందులను అందించాలని. మందుల కొరత ఏర్పడకముందే సమాచారం ఇవ్వాలని తెలిపారు.