వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై గురువారం కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాలు, వాటి నిర్వహణపై చర్చించారు. మండలంలో మొత్తం 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా. వీటిలో ఐకేపీ ఆధ్వర్యాన 5, పీఏసీఎస్‌ల ఆధ్వర్యాన 4, డీసీఎంఎస్ ఆధ్వర్యాన 3 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.