తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వే కూసుమంచి మండలంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, ఎంపీఓ రాంచందర్రావు బుధవారం మండలంలోని పలు గ్రామాలను సందర్శించి సర్వే తీరును పరిశీలించి సిబ్బంది, ప్రజలతో మాట్లాడారు. మండలంలో మొత్తం 20,836 ఇళ్లకు గానూ బుధవారం 6,231 ఇళ్లను సర్వే చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు.