రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుండగా. పేదలకే లబ్ధి జరిగేలా ఇందిరమ్మ కమిటీల సభ్యులు, నాయకులు చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ఖమ్మం రూరల్ మండల అధికారులు, నాయకులతో జరిగిన సమీక్షలో గ్రామాల వారీగా సమస్యలు తెలుసుకున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు.