ప్రజలకు ఏ కష్టం వచ్చినా అన్నివేళలా తోడుండి ఆదుకునేది కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఎం జిల్లా నాయకుడు షేక్ బషీరుద్దీన్ అన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని జూపెడలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం ఉన్నా, లేకపోయినా ప్రజలను అంటిపెట్టుకొని ఉంటుండడంతో ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష పార్టీలకు ఆదరణ లభిస్తుందన్నారు. అనంతరం పార్టీ గ్రామశాఖ కార్యదర్శిగా కోట ఉపేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.