ఆళ్ళపల్లి: రైతులు పండించిన అన్ని రకాల పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని తహాశీల్దార్ కార్యాలయం ధర్నా చేపట్టి తహాశీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఏఐకెఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెనక రామస్వామి అద్యక్షతన ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు.