మధిర మండలంలోని చెరువులలో శుక్రవారం మత్స్య శాఖ అధికారులు, సొసైటీ సంఘం సభ్యుల సమక్షంలో మధిర పెద్ద చెరువులో చేప పిల్లలను వదలడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా, కమిషనర్ సంపత్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ. 100% రాయితీపై మొదటి విడతలో 50% ఉచిత చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు.