చింతకాని పీహెచ్సీని పరిశీలించిన డీఎంహెచ్ఓ

63பார்த்தது
చింతకాని పీహెచ్సీని పరిశీలించిన డీఎంహెచ్ఓ
చింతకాని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వరికూటి సుబ్బారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో జ్వరాలు అదుపులో ఉన్నాయా అని వైద్యులను అడిగారు, హాస్పిటల్లోని ల్యాబ్, ఫార్మసీ, రికార్డును పరిశీలించారు. అలాగే, ప్రజలకు అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని, అకారణంగా విధులకు గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி