మధిర మండల పరిధిలోని మహాదేవపురం, ఇల్లూరు, మధిర కు చెందిన బెల్ట్ షాపులలో ప్రభుత్వ అనుమతి లేకుండా మద్యం నిల్వ ఉంచి అక్రమంగా మద్యం అమ్ముతున్న 4 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 80, 000 రూపాయల మద్యం బాటిల్స్ పట్టుకొని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కేసు నమోదు చేయడం జరిగిందని టౌన్ ఎస్. హెచ్. ఓ రిత్విక్ సాయి ఐపీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.