తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల స్థాయిలో 27 వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో బిజెపి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.