ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామంలో ఆదివారం మండల సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజలకు ఆయన చేసిన సేవలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ నాయకులు, స్థానిక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.